అందాం, విందాం, ఆనందిద్దాం!


కథ వినండి.

అనగా అనగా ఒక అబ్బాయి.
ఆ అబ్బాయి బాగా తెలివైన వాడని అందరూ అంటూ ఉండే వారు.
ఆ విషయం రాజు గారిని చేరింది.
రాజు గారు ఆ అబ్బాయి తెలివి తేటలని పరీక్షించాలనుకున్నారు.

అతనిని పిలిపించారు.
ఒక పలక మీద రెండు గీతలు గీశారు.
ఒక గీత చిన్నది.
ఇంకో గీత దానికన్నా కొంచెం పెద్దది.
“పెద్ద గీతను చెరపకూడదు. కానీ ఆ గీతను చిన్న గీత చెయ్యాలి,” అన్నారు.

ఆ అబ్బాయి ఆలోచించాడు.
బలపం తీసుకున్నాడు.
చిన్న గీతను పెంచాడు.
పక్కనున్న పెద్ద గీతకన్నా పొడవు పెంచాడు.
అంతే, చెరపకుండానే పెద్ద గీత చిన్న గీత అయిపోయింది!

ఆ అబ్బాయి ఎవరో కాదు, (మహామంత్రి) తిమ్మరుసు అని అంటారు.

Comments on: "చిన్న గీత, పెద్ద గీత" (5)

  1. లలితగారూ

    మంచి ప్రయత్నం. బాగుంది. చిన్న చిన్న పదాలతో పిల్లలకు అర్థమయ్యేలాగ. ఈ కథ విన్నాక వాళ్లంతట వాళ్లు తమ స్నేహితులకు కూడా చెప్పే సౌలభ్యం ఉంది ఇలా చెప్పడం మూలాన…. ఇలాగే ఉంచండి……తెలుగు4కిడ్స్లోనూ, ఇక్కడా రెండు చోట్లా పెట్టండి….ఒక చోట కాకపోయినా, ఇంకో చోటైనా ఎవరో ఒకరికి దొరుకుతుంది….

    పాఠకులు కామెంట్సుతోనూ, మన అదృష్టాన్ని బట్టీ, మన జాతకాన్ని బట్టీ అన్నిసార్లూ కాకపోయినా కొన్నిసార్లు మంచి అభిప్రాయాల రూపంలోనూ పాల్గొంటారు కానీ, వాళ్ల మీద ఆశలు పెద్దగా పెట్టుకోకండి…..మన పని మనం చేసుకుంటూ పోవడమే….చేస్తూ ఉంటే మనకే బోల్డు అవుడియాలొచ్చేస్తూ ఉంటాయి……ఆ అవుడియాకో రూపమిచ్చి పారేయ్యటం మన చేతిలో పనే…..ఎవడో ఒక్క పిల్లాడికో, పిల్లకో ఉపయోగపడ్డా సంతోషమే…..

    All The Best As Always

    వంశీ

  2. good…keep post few more

  3. మంచి కృషి అండి. ఇప్పుడు చాలా కథలు వినడానికి ప్రయత్నించాను. ఫైర్ఫాక్స్ లోనూ, ఎక్స్ప్లోరెర్లోనూ.. వినలేకపోయాను. ఒకసారి చూడరా?

Leave a comment