విందాం!

Archive for the ‘విషయాలు’ Category

దీపావళి

దీపావళి పండగ దీపాల పండగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి రోజు బాణా సంచా కూడా కాలుస్తారు. ఈ పండుగ అక్టోబరు లేదా నవంబరు నెలలో వస్తుంది. తెలుగు క్యాలెండరు ప్రకారం, ఆశ్వయుజ అమావాస్య నాడు జరుపుకుంటారు. అంతకు ముందు రోజు, అంటే ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజు, నరక చతుర్దశి అంటారు. ఆ రోజు శ్రీ కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు అంటారు. అప్పుడు ప్రజలు సంతోషంతో [...]

ఇంద్ర ధనస్సు

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు ఉంటాయి. అవి: వంకాయ రంగు, నీలిమందు రంగు, నీలం, ఆకుపచ్చ, పసుపు పచ్చ, కాషాయం (నారింజ రంగు), ఎరుపు. ఎరుపు రంగు అన్నిటికన్నా పైన కనిపిస్తుంది. వాన వెలిసి ఎండ వచ్చేటప్పుడు ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపించే అవకాశం ఉంది. సూర్య రశ్మి వాతావరణంలోని తేమలో ఉన్న నీటి బిందువుల ద్వారా ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. తేమ – humidity – తడి, చెమ్మ నీటి బిందువు – water droplet – [...]

భూమి

భూమి గుండ్రంగా ఉంటుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. ఆ సమయాన్ని మనం ఒక రోజు అంటాము. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలూ, రాత్రీ ఏర్పడతాయి. భూమి సూర్యుడి చుట్టూ ఒక సారి తిరగడానికి 365 రోజులు పడుతుంది. ఆ సమయాన్ని మనం ఒక ఏడాది, లేదా సంవత్సరము అంటాము. సమయం – [...]

Tag Cloud

Follow

Get every new post delivered to your Inbox.